Bhagavad Gita: Chapter 4, Verse 20
https://www.holy-bhagavad-gita.org/chapter/4/verse/20/te త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః । కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ।। 20 ।। ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై ఆసక్తి/మమకారం త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తి తో ఉంటారు మరియు బాహ్య వస్తు-విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమయి ఉన్నా, వారు ఏమి చేయనట్టే. బాహ్యంగా కనిపించే దానిబట్టి కర్మలను ఎలాంటివో నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి, ఆ పనిని కర్మనా లేదా ఆకర్మనా అని నిర్ణయిస్తుంది. జ్ఞానుల యొక్క మనస్సు ఎప్పుడూ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమయి ఉంటుంది. భక్తి తో భగవత్ సంయోగం లో సంపూర్ణ తృప్తి తో ఉండి, భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారి అన్ని పనులు అకర్మ గా పరిగణించబడుతాయి. ఈ విషయాన్ని విశదీకరిస్తూ పురాణాలలో ఒక మధురమైన కథ ఉంది. బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దూర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీ కృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచ...